22-02-2025 12:00:00 AM
వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ కథా నాయకుడు సుహాస్ , మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం గా ఉన్నాడు. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ అంది స్తూ అందరిని అలరించడానికి సిద్ధమయ్యాడు సుహాస్. ‘ఓ భామ అయ్యో రామ’ అనే ఈ ప్రేమకథలో మలయాళ నటి మాళవిక మనోజ్ (‘జో’ ఫేమ్) కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమాను రామ్ గోధల తన తొలి ప్రయత్నంగా దర్శకత్వం చేస్తున్నారు.
వీ ఆర్ట్స్ పతాకంపై హరీశ్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. కాగా ఈ చిత్రంలో దర్శకుడు హరీశ్ శంకర్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రను హరీశ్ శంకర్ చేస్తేనే బాగుంటుందని భావించిన మేకర్స్ ఆయన్ను ఒప్పించి షూటింగ్‌ను ఇటీవల పూర్తిచేశారు. ‘సుహాస్ కెరీర్‌కు మైలురాయిగా నిలిచే చిత్రంగా ఇది ఉంటుంది. సున్నితమైన ప్రేమ భావోద్వేగాలతోపాటు అంతకు మించి ఫన్ ఉంటుంది. ఈ వేసవిలో ఇది బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది’ అని నిర్మాత తెలిపారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.