calender_icon.png 30 September, 2024 | 2:04 PM

సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన హరీశ్ రావు

04-09-2024 08:10:33 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. గురుకులాల్లో తొలగించిన సిబ్బందిని పునర్ నియమించాలని హరీశ్ రావు పేర్కొన్నారు. సెప్టెంబర్ 5వ తేదీన టీచర్లకు అదనపు ప్రోత్సాహకాలు అందిచడం ఆనవాయితీ అన్నారు. 6200 మంది తాత్కాలిక టీచర్లు, లెక్చరర్లు, డీఈవోలను ఏకకాలంలో తొలగించారని హరీశ్ రావు తెలిపారు. 6200 మందిని తొలగించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని, రాష్ట్ర ప్రభుత్వం 3 నెలలుగా వీరికి జీతాలు చెల్లించడం లేదని హరీశ్ రావు దుయ్యబట్టారు.

ఇదిలా ఉండగా.. వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు హరీశ్ రావు తెలిజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన సహాయక చర్యలు చేపట్టింది.

అందుకు తోడుగా బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యుల ఒక నెల జీతాన్ని వారికి అందించనున్నట్లు తెలిపారు. ప్రజల కష్టాల్లో తోడుండే బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కూడా విలయం సృష్టించిన విపత్తులో ప్రజలతో ప్రజల పక్షాన నిలబడిందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఎమ్మెల్యే హరీశ్ రావు వెల్లడించారు.