calender_icon.png 26 December, 2024 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ

14-07-2024 08:30:26 PM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అనుమతించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హాయంలో 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని గంతో భట్టీ విక్రమార్క డిమాండ్ చేసినట్లు గుర్తు చేశారు. మీ ప్రకటనను కట్టుబడి  గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తి చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు కోరారు.

మీరిచ్చిన హామీ ప్రకారం గ్రూప్-2,3 పోస్టుల సంఖ్య పెంచాలని, పోటీ పరీక్షల మధ్య కాలవ్యవధి తక్కువగా ఉండడం వల్ల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మెగా డీఎస్సీ ఇచ్చి జాబ్ క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్ జారీ చేయాలని, నిరుద్యోగులకు రూ.4 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వస్తే జీవో నెంబర్ 46 రద్దు చేస్తామని నమ్మించారని హరీశ్ రావు మండిపడ్డారు.