calender_icon.png 13 January, 2025 | 11:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణపై ‘సుప్రీం’ తీర్పును స్వాగతిస్తున్నాం..

01-08-2024 03:14:42 PM

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ హరీశ్ రావు తన ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ ఉద్యమం నుంచే బిఆర్ఎస్ పోరాటం చేస్తున్నదని, ఉద్యమ నాయకుడిగా, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆనాడే ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ చేశారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 29 నవంబర్ 2014లో మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం అందరికి విదితమే. ఎస్సీ వర్గీకరణ చేయాలని 16 మే 2016 నాడు ప్రధాని మోదీని స్వయంగా కడీయం శ్రీహరి, కేసీఆర్ కలిసి లేఖ ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, తద్వారా విద్య, ఉద్యోగ అవకాశాల్లో యువతకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు ఈ సందర్భంగా హరీశ్ రావు పేర్కొన్నారు.