calender_icon.png 22 December, 2024 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్‌రావు అరెస్ట్

13-09-2024 03:35:00 AM

  1. కేశంపేట్ పీఎస్‌కు బీఆర్‌ఎస్ నేతల తరలింపు
  2. సొంత పూచీకత్తుపై విడుదల
  3. అనంతరం హైదరాబాద్‌కు 

రంగారెడ్డి, సెప్టెంబర్ 12(విజయక్రాంతి):  ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడికి పాల్పడిన  ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని కో రుతూ గురువారం సాయంత్రం సైబరాబాద్ సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నిరసనకు దిగారు.

మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమాలకర్, ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, వివేకనందా, ఎమ్మెల్సీ శంబీపూర రాజు, ఎర్రెళ్ల శ్రీను, పలువురు నేతలు వారికి మద్దతు ప్రకటించారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారిని పోలీసు లు కోరారు. అయితే ఎంతకూ వినక పోవడంతో వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి  ఓఆర్‌ఆర్ మీదుగా సైబరాబాద్ పరిధిలోని వివిధ పీఎస్‌లకు తరలించారు. కొత్తూరు మండలంలోని ఇన్ముల్‌నర్వలో మాజీ ఎమ్మె ల్యే అంజయ్యయాదవ్, పార్టీ నేతలు వాహనాలను అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత  నెలకొంది.

హరీశ్ రావుకు గాయం..

హరీశ్‌రావును తలకొండపల్లి మండలంలోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు  మండల కేంద్రానికి చేరుకుని ధర్నాకు దిగడతో వారిని  పోలీసులు  చెదరగొట్టి  పీఎస్‌కు తరలించారు.ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో హరీశ్‌రావు భుజానికి గాయమైంది. వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అక్కడి నుంచి వారంతా హైదరాబాద్‌కు తరలి వెళ్లారు.

 పీఎస్‌లో బైఠాయించిన నేతలు..

తమను అరెస్ట్ చేసి ఇంత దూరం ఎందుకు తీసుకోచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలు హరీశ్, పల్లా, ప్రశాంత్‌రెడ్డి, గంగుల, ఎంపీ రవిచంద్ర ఫైర్ అయ్యారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో బైఠాయించి నిరసనకు దిగారు.