27-02-2025 05:09:50 PM
15 నెలల్లోనే ఐదు ప్రాజెక్టులలో ప్రమాదం
దోమల పెంటను మంత్రుల బృందం టూరిస్ట్ ప్లేస్ గా ఎంచుకుంది
ఆరు రోజులైనా తట్టెడు మట్టి తీయకపోవడం దురదృష్టకరం
కార్మికుల కుటుంబాలను ఎందుకు దాస్తున్నారో చెప్పాలి
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తికాకముందే రాష్ట్రంలోని సుమారు ఐదు ప్రాజెక్టుల్లో ప్రమాదం చోటు చేస్తుందని, ఇది ప్రభుత్వ బాధ్యత రాహిత్యమేనని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Former Minister Tanniru Harish Rao) ఆరోపించారు. గురువారం శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్(Srisailam Left Bank Canal Tunnel) ప్రమాద ఘటనను సందర్శించేందుకు వచ్చిన ఆయనను మొదటగా పోలీసులు తన రాకను అడ్డుకున్నారని, ఆ తర్వాత కొందరిని మాత్రమే లోనికి అనుమతించారన్నారు. అక్కడి పరిస్థితులను పూర్తిగా గమనించి రెస్క్యూటీమ్ లో మాట్లాడిన సందర్భంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో ఉందని గుర్తించినట్లు తెలిపారు.
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Irrigation Minister Uttam Kumar Reddy) రెండు రోజుల్లోనే రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసి కార్మికులను కాపాడతామని గొప్పలు చెప్పుకుంటూ క్షేత్రస్థాయిలో మాత్రం 11 రకాల రెస్క్యూ టీం బృందాలు పనిచేస్తున్న ఎవరికీ పూర్తిస్థాయి ఆదేశాలు ఇవ్వకపోవడంలేదన్నారు. మంత్రుల మాటలకి చేతలకి పొంతన లేకుండా ఉందని మండిపడ్డారు. గత పదేళ్ల కాలంలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేసేందుకు 3900 కోట్లు ఖర్చు చేసి కరోనా తీవ్రత వల్ల 12 కిలోమీటర్లు సొరంగాన్ని తవ్వినట్లు గుర్తు చేశారు. సొరంగం కుప్పకూలి 8 మంది కార్మికులు చిక్కుకున్నప్పటికీ కార్మికుల ప్రాణాల మీద ధ్యాస పెట్టకుండా ఎన్నికలపైనే శ్రద్ధ చూపడం దుర్మార్గమన్నారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించకుండా కనీసం సమీక్ష కూడా జరపకపోవడం బాధ్యత రాహిత్యం కాదా అని ప్రశ్నించారు.
రోజురోజుకు శ్రీశైలంలో నీటి మట్టం తగ్గుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆంతర్యమెంటో చెప్పాలన్నారు. ప్రాజెక్టు తిరిగి ప్రారంభించే క్రమంలో జాగ్రత్త చర్యలు చేపట్టలేదని అందులో భాగంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ప్రమాదం జరిగి ఆరు రోజులు అవుతున్న ఇప్పటివరకు తట్టెడు మట్టి తీయలేదని ఇప్పటికీ ఎన్ని రోజులు అవుతుందో కూడా స్పష్టత లేదని మండిపడ్డారు ప్రమాదం జరిగినప్పటికీ కార్మికులను కాపాడాలన్న లక్ష్యం పెట్టుకోలేదని ఇప్పటికైనా వేగంగా జాగ్రత్తగా పనులు పూర్తి చేసి కార్మికులను కాపాడాలని డిమాండ్ చేశారు అనంతరం క్యాంప్ కార్యాలయంలోనే ఉన్న మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కాల్చేందుకు అనుమతి ఇవ్వాలని ప్రయత్నించడంతో పోలీసులు వారిని నిలువరించారు. దీంతో కొద్దిసేపు ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.