02-04-2025 12:14:30 AM
- పుప్పాలగూడలోని ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్త్
రాజేంద్రనగర్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): మాజీ మంత్రి హరీష్ రావును పోలీ సులు హౌస్ అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్తారేమోనని అనుమానంతో పోలీసులు ఆయనను మంగళవారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు.
మణికొండ మున్సిపల్ పరిధిలోని పుప్పాల గూడలో ఉన్న క్రిన్స్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ లో ఉదయమే ఆయన ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఆయన బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అదేవిధంగా మా జీ మంత్రి హరీష్ రావును కలిసేందుకు వచ్చిన వారిని కూడా అనుమతించలేదు. ఈ సందర్భంగా ప్రభుత్వంతో పాటు పోలీసుల తీరుపై హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.