హైదరాబాద్ : రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మభ్యపెట్టిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై ఆంక్షలు పెట్టారని, రేషన్ కార్డు నిబంధన లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమేందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీకి విధించిన గడువు తేదీ అసమంజసం అన్నారు. డిసెంబర్ 12, 2018 మందు వర్తించదనడం సరికాదని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ కంటే వడపోతలపైనే పెట్టిన దృష్టి, రైతు రుణభారం తగ్గించడంపై ప్రభుత్వానికి దృష్టి లేదని హరిశ్ రావు ఎద్దెవా చేశారు. ప్రభుత్వంపై భారం తగ్గించడంపైనే దృష్టి పెడుతున్నారని విరుచుకుపడ్డారు.