14-02-2025 12:37:12 AM
రాజేంద్రనగర్ (విజయక్రాంతి) ఫిబ్రవరి 13 : శంషాబాద్ మండల పరిధి ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు సందర్శించారు. సమతాకుంభ్ 2025 తృతీయ వార్షికోత్సవాల్లో భాగంగా హరీష్రావు క్షేత్రానికి వచ్చి చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
యాగ శాలకు వచ్చి అర్చకులతో కంకణ ధారణ చేయించుకున్నారు. అలాగే పూజతో పాటు తీర్థగోష్ఠిలో పాల్గొన్నారు. భక్తులతో పాటు హరీష్రావు.. స్వామివారి నుంచి తీర్థం స్వీకరించారు.