calender_icon.png 8 September, 2024 | 8:48 AM

ఆచరణ సాధ్యం కానీ అవాస్తవాల బడ్జెట్ ఇది: హరీశ్ రావు

27-07-2024 01:10:58 PM

బడ్జెట్ లో వాస్తవాల విస్మరణ.. అవస్తవాల ప్రస్తావన

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ అవాస్తవాలతో కూడిన బడ్జెట్ అని హరీశ్ రావు ఆరోపించారు. విధానాల రూపకల్పన కంటే మిమ్మల్ని తిట్టడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పాలనలో కరెంట్ పరిస్థితి గురించి రేవంత్ రెడ్డి మాట్టాడారని ఆయన గుర్తుచేశారు. బడ్జెట్ లో వాస్తవాల విస్మరణ.. అవాస్తవాల ప్రస్తావన ఉందన్నారు. తమ పనితీరు తెలియకూడదని పదేళ్ల ప్రభుత్వ సమాచారాన్ని తొలగించారని మండిపడ్డారు. కంప్యూటర్ నుంచి తొలగిస్తారేమో కానీ, ప్రజల మెదడు నుంచి తొలగించలేరని స్పష్టం చేశారు. అక్షరాలను తొలగిస్తారేమో కానీ.. అనుభవాన్ని తొలగించలేరని హరీశ్ రావు వెల్లడించారు. ఆచరణ సాధ్యం కానీ అవాస్తవాల బడ్జెట్ ఇదని ఆయన పేర్కొన్నారు.