calender_icon.png 31 January, 2025 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవంబర్ 29 లేకపోతే.. డిసెంబర్ 9 ప్రకటన లేదు

11-12-2024 04:48:26 PM

తెలంగాణ చరిత్ర మార్చాలని చూస్తుండ్రు

ఎవరో భిక్ష వల్ల తెలంగాణ రాష్ట్ర రాలేదు..

హైదరాబాద్: ఇచ్చిన మాట ప్రకారం 2009లోనే రాష్ట్రం ఇచ్చి ఉంటే కేసీఆర్ ఉద్యమం చేసేవారు కాదని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాదా? అని సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర సాధనకోసం కేసీఆర్ నిరహారదీక్ష చేశారని గుర్తుచేశారు. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదని చెప్పారు. కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్ర వచ్చిందని స్పష్టం చేశారు. ఎవరో భిక్ష వల్ల తెలంగాణ రాష్ట్రం రాలేదని సూచించారు. ఉద్యమంలో రాజీనామా చేయమంటూ రేవంత్ రెడ్డి చేయలేదన్న హరీశ్ రావు తెలంగాణ చరిత్రను మార్చాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి హరీశ్ రావు, స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్, బిఆర్ఎస్ నాయకులు పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.  జూన్ 2, 2015 నాడు మంత్రి హోదాలో ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ తో కలిసి ఆవిష్కరించారు.