calender_icon.png 27 February, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్‌రావు తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

27-02-2025 01:50:41 AM

  • తెలంగాణ రాష్ర్టంలో బీజేపీ పార్టీ ఎప్పుడు అధికారంలోకి రాదు
  • రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి

వనపర్తి, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): మాజీ మంత్రి హరీష్ రావు  అవగాహన లేకుండా లోకల్ నాయకుల సమాచారంతో తప్పుడు ఆరోపణలు చేయొద్దని రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి సూచించారు.  బుధవారం జిల్లా కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... ఎన్నికల సంఘం నియమాల ప్రకారం ఎంపీ ఎన్నికకు రూ 95 లక్షలు, శాసనసభ ఎన్నికకు రూ 40 లక్షలు, , జెడ్పిటిసి ఎన్నికకు లక్ష 60 వేలు,  ఎంపీటీసీకి రూ 80వేలు, సర్పం ఎన్నికకు ఐదు నుంచి ఆరు వేలు ఉన్న ఓటర్ల గ్రామానికి రెండున్నర లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలని నియమాలు ఉన్నాయని కానీ .

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలాంటి వ్యయ పరిమితి లేదని తెలుసుకోవాలని ఆయన హితువు పలికారు. మీరు అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎంత ఖర్చు పెట్టారో అందరికీ తెలుసని అది మరిచి ఈరోజు విమర్శలు చేయడం మంచిది కాదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డితో నాకు డబ్బులు వస్తున్నాయని ఆరోపణలు సరికావని ఏవైనా ఆధారాలు ఉంటే చూపించాలని అన్నారు.

బిజెపి నాయకులు నారాయణ  ప్రెస్ మీట్ పెట్టి వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే వర్గంగా ,చిన్నారెడ్డి వర్గంగా ఏర్పడి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేయడం తగదు అని ఆయన హెచ్చరించారు. మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డి  రాకతో వనపర్తి నియోజకవర్గం లో వెయ్యికోట్ల పనులకు ఎమ్మెల్యే , ఎంపీ  శ్రీకారం చుట్టారని అంతకన్నా ఈ నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధిని చేయాలో చెప్పాలని అన్నారు. 

ముఖ్యమంత్రి  కార్యక్రమంలో అందరం పాల్గొంటూ విజయవంతం చేస్తామని అన్నారు.తెలంగాణ రాష్ర్టంలో బిజెపి పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాదు అని  అన్నారు. గోపాల్ పేట మార్కెట్ యార్డ్ విషయంలో మండల కేంద్రంలో పెడితే మండలం అభివృద్ధి చెందుతుందనే మార్కెట్ యార్డ్ పెట్టాలని సూచించానని దానిని తప్పుగా చిత్రీకరిస్తూ అడ్డుకుంటున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.

పోలికపహాడ్ గ్రామ సర్పంచిగా సత్యశిలారెడ్డి పోటీ చేసే సమయంలో అభ్యర్థిగా సుధాకర్ రెడ్డి  పోటీ చేశారని సుధాకర్ రెడ్డి ని  విత్ డ్రా చేయించి సత్యశీల రెడ్డి ని ఏకగ్రీవం చేశామని ఆయన తెలిపారు. 2004 లో ఎమ్మెల్యేగా నేను ఉన్న సమయంలో గోపాల్పేట్ 16ఎంపీటీసీ స్థానాలలో  8 కాంగ్రెస్ 8 టిడిపి గెలిచాయని అప్పటి టిడిపి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి  హాల్లో కూర్చున్న నా ప్రత్యేక చొరవతో ప్రభావతి ని ఎంపీపీగా చేశామని ఆ కృతజ్ఞత మరిచి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.

ఒక ఆడబిడ్డ ఆవేశంగా మాట్లాడటం తప్పు అని ఒక చెల్లెలుగా మానుకోవాలని ఆయన సూచించారు. వనపర్తి నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలు చేశామని సభ్యత్వ రుసుము నా సొంత డబ్బుతో చెల్లించాలని అన్నారు. రాజశేఖర్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తికి భయపడకుండా 2001 లో 41 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ రాష్ర్టం కావాలని సోనియా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చానని అప్పటి తెలంగాణ రాష్ర్ట మలిదశ ఉద్యమం మొదలైందని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.