calender_icon.png 29 March, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు : హరీశ్ రావు

26-03-2025 08:17:21 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నిబంధనల పూర్తి విరుద్ధమని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. శాసనసభలో కోర్టుల గురించి కూడా మేం ఏదైనా మాట్లాడుతామని రేవంత్ రెడ్డి అంటున్నాడని, కానీ, సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న విషయాల గురించి అసెంబ్లీలో మాట్లాడకూడదని స్పష్టమైన రూల్ ఉందని హరీశ్ రావు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రాజ్యంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని, సీఎం తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశామన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ నిషేధిస్తూ మేం గతంలోనే ఉత్తర్వులిచ్చామని హరీశ్ రావు గుర్తు చేశారు.

బెట్టింగ్ యాప్స్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సీఎం చెప్పిన ప్రాంతంలో ఇప్పటికే 4 రోడ్లుంటే ఐదోది ఎందుకు..?, రూ.5000 కోట్లతో పది వరసల రహదారి ఎవరి కోసం..?,  జీతాలకే డబ్బులు లేవు.. రూ.5000 కోట్లతో రోడ్డు ఎందుకు..? అని హరీశ్ రావు ప్రశ్నించారు. బడ్జెట్ లో రూ.70 వేల కోట్ల లోటుందని సీఎం గతంలో చెప్పారని, ఇవాళ 95 శాతం బడ్జెట్ నిజం కాబోతుందన్నారు... ఏది నిజం..? అని అడిగారు. ఐఎంజీ భూములపై కోర్టుల్లో బీఆర్ఎస్ సర్కారు కొట్లాడిందని, కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కడియం శ్రీహరి బహిరంగంగా చెప్తున్నారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం కడియం కాంగ్రెస్ లో చేరలేదంటున్నారని హరీశ్ రావు వెల్లడించారు.