హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఉల్లంఘనలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గెలిపించిన నాయుకులకు విలువ లేదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేల ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేసిన స్పందనలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ హరీశ్ రావు చేశారు.