calender_icon.png 20 January, 2025 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ వచ్చింది.. రైతన్నకు క‘న్నీటి’ గోసను తెచ్చింది

20-01-2025 05:53:11 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో రైతన్నలు పంట పొలాలకు నీళ్ల కోసం రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిని దుస్థితిని కల్పించిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు(Former BRS Minister Harish Rao) ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా సూర్యపేటలోనే రైతుల రోడ్డెక్కి ఆందోళన చేస్తే, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల పరిస్థితి ఏమిటి..? అని ప్రశ్నించారు. యాసంగి సాగునీటి విడుదల షెడ్యూల్ పేరిట కోట్ల ప్రజాధనం వెచ్చించి ప్రకటనలు ఇచ్చారని, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్-2లో భాగంగా తుంగతుర్తి, సూర్యపేట, కోదాడ తదితర నియోజకవర్గాల్లోని 3,36,630 ఎకరాలకు సాగునీటిని విడుదల చేస్తామని ప్రకటనల్లో పేర్కొన్నారు. మంత్రులు ప్రచారం చేసుకున్నారు గానీ, రైతన్నల పంట పొలాలకు నీళ్లు మాత్రం విడుదల చేయడం లేదని విమర్శించారు.

మీ ప్రభుత్వ మాటలు నమ్మి నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఏం కావాలి..? అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీశ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో వరి నాట్ల దశలోనే సాగునీటికి గోస పడితే, మన్ముందు సాగు నీరు నీటి సరఫరా ఎలా చేస్తారని అడిగారు. రేవంత్ రెడ్డి, సహా మంత్రుల మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటవు అని మరోసారి రుజువైందని విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు చేస్తున్నట్లు ప్రజలను భ్రమలు కల్పించడం మానేసి, ఇప్పటికైనా ఆచరణకు దిగండి..? ఆయన చురకలంటించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలతో ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయడం మానేసి, పంట పొలాలకు నీళ్లు అందించండి. ఆందోళనలో ఉన్న రైతన్నకు దన్నుగా నిలవండి..? అని హరీశ్ రావు ప్రజా ప్రభుత్వంపై మండిపడ్డారు.