హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయటం ఏమిటి? అని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ప్రశ్నించారు. అసెంబ్లీని వాయిదా వేయడంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. క్యాబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు గారు కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదన్నారు. నేడు పాలక పక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదంటున్నారని, ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు? అని హరీశ్ రావు అధికార పార్టీ నాయకులపై భగ్గుమన్నారు.