calender_icon.png 24 November, 2024 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలను ఒప్పించి భూసేకరణ చేయాలి: హరీశ్ రావు

24-11-2024 04:16:16 PM

హుజూరాబాద్,(విజయక్రాంతి): మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధిచెప్పారని, ఓటమి తర్వాతైనా కాంగ్రెస్ పార్టీ మోసాలు మానుకోవాలని బీఆర్ఎస్ మాజీ హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, లగచర్లకు నేతలేవరూ వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ సర్కార్ 1800 మందికి దళితబంధు నిధులు మంజూరు చేస్తే వాటిని కూడా దళితులు వాడుకోకుండా నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, లగచర్లలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని అబద్ధాలు చెప్పి జులై 19న గెజిట్ విడుదల చేశారు.  సీఎం రేవంత్ రెడ్డి లగచర్లకు వెళ్లి ప్రజలను ఒప్పించి భూసేకరణ చేయాలని సవాలు విసిరారు.  కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పి 20 టీఎంసీలు హైదరాబాద్ కు ఎలా తీసుకెళ్తారని హరీశ్ రావు ప్రశ్నించారు.