హైదరాబాద్,(విజయక్రాంతి): రేపటి నుంచి అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వస్తారో.. రారో.. మీరే చూస్తారుగా అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆదివారం సిద్దిపేట జిల్లా ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో చర్చ జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడతామని హరీశ్ రావు చెప్పారు. ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీలను చట్టబద్ధత చేసే వరకు పోరాడతామని, రైతులకు రెండు విడతల రైతుబంధు ఇవ్వాలని పట్టుబడతామని పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై గళం విప్పుతామని హరీశ్ రావు స్పష్టం చేశారు.