calender_icon.png 19 April, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టు తీర్పు.. ప్రభుత్వానికి చెంపపెట్టు

16-04-2025 02:52:17 PM

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన, చేయబోతున్న పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైందో సుప్రీంకోర్టు( Supreme Court verdict)లో జరిగిన వాదనల వల్ల ప్రపంచానికి తేటతెల్లమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Thanneeru Harish Rao) అన్నారు. బాధ్యత గల ప్రభుత్వం, కావాలనే సెలవు దినాల్లో బుల్‌డోజర్లతో విధ్వంసానికి పాల్పడటంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు అని హరీశ్ రావు తెలిపారు. విధ్వంసం చేసిన వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని నిలదీయడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన పేర్కొన్నారు.

కంచె గచ్చిబౌలి భూములను, పర్యావరణాన్ని కబళించాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(Central Empowered Committee) తన రిపోర్టుతో కళ్లు తెరిపించిందన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిగా వ్యవహరిస్తే సభ్య సమాజం, న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోవని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ముందుకు వస్తాయని గతంలోనూ అనేక సార్లు నిరూపనైంది.. ఈరోజు కూడా అదే జరిగిందని స్పష్టం చేశారు.

విధ్వంసమే విధానంగా సాగుతున్నది రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిరంకుశ పాలన నాడు హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చి అరాచకం సృష్టించదన్నారు. నేడు బుల్‌డోజర్లతో పర్యావరణ హననం అన్నారు. మాకు న్యాయస్థానాల మీద ఎంతో గౌరవం ఉందన్న హరీశ్ రావు అందుకే బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ తరుపున సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి నివేదిక ఇచ్చామని తెలిపారు. ఆధారాలతో సహా వాస్తవాలు వివరించామని వెల్లడించారు. వృక్షో రక్షతి రక్షిత అని పెద్దలంటే, వృక్షో భక్షతి అన్నట్లుగా తయారైన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఏకం కావాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.