calender_icon.png 16 April, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగు నీళ్ల కోసం ప్రజల ఘోష

16-04-2025 11:43:49 AM

ఇన్నాళ్లు సాగు నీళ్ల కోసం రైతుల గోస..

కాంగ్రెస్ పాలనలో తడారిన పొలాలు..

ఎడారి అయిపోతున్న ప్రజల బతుకులు..

హైదరాబాద్: తెలంగాణలో నెలకొన్న తాగునీటి సంక్షోభానికి(Drinking water) కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు(BRS MLA Harish Rao) అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, నీటి సరఫరాలో తప్పుడు నిర్వహణ వల్లే ఈ కృత్రిమ కరువు వచ్చిందని ఆయన ఆరోపించారు. గతంలో లాగా, ప్రభుత్వ కుళాయిలు, కమ్యూనిటీ బావులు, నీటి ట్యాంకర్లలో ప్రజలు బిందలు, డ్రమ్ములతో క్యూలలో వేచి ఉండాల్సి వస్తోందని హరీష్ రావు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసి తాగు నీళ్ళైస్తే, రేవంత్ రెడ్డి కనీసం ఆ పథకాన్ని కొనసాగించలేక పోతున్నడు” అని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం సాగునీరు, తాగునీరు రెండింటిలోనూ విఫలమైందని మాజీ మంత్రి అన్నారు. నీటి కొరత కారణంగా వ్యవసాయ పొలాలు ఎండిపోగా, ఇప్పుడు ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. "నిర్లక్ష్యం, ప్రణాళిక లేకపోవడం వల్ల, ప్రభుత్వం నదుల నుండి తగినంత నీటిని నిల్వ చేయలేదు. ఫలితంగా, అన్ని నీటి వనరులు ఖాళీగా ఉన్నాయి, భూగర్భజలాలు ఇంకా తగ్గిపోతున్నాయి. మిషన్ భగీరథను ఉపయోగించి తాగునీరు కూడా సమర్థవంతంగా సరఫరా చేయబడటం లేదు" అని ఆయన వివరించారు. దీనిని మానవ నిర్మిత కరువు అని పేర్కొంటూ, రాష్ట్రాన్ని వెనక్కి నెట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు విమర్శించారు. "ఇది ప్రకృతి కరువు కాదు, పరిపాలన సరిగా లేకపోవడం వల్ల ఏర్పడినది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి" అని సూచించారు. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), మంత్రివర్గం అబద్ధాల ప్రవాహాన్ని పారించడం మానేసి, ప్రజల ఇళ్లకు తాగునీటి సరఫరాను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.