calender_icon.png 25 November, 2024 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధుల తిరస్కరణ సరే.. ఒప్పందాల సంగతేంది..?

25-11-2024 05:37:40 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అదాని అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో మీరు దావోస్ లో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతేమిటి?, అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రల మాటేమిటి? అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ హయంలో 20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడుతామని ప్రతిపాదనతో వస్తే తమ దగ్గరకు వస్తే మర్యాదపూర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపించేశామని హరీశ్ రావు పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటించిందని, రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచిందని ఆరోపించారు. ఢిల్లీలో రాహుల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం అదానితో దోస్తీ చేసి ఒప్పందాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.ఇప్పుడేమో అదాని అవినీతి బయటికిరాగానే మాట మార్చారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాల‌న్నింటినీ ర‌ద్దు చేయాల‌ని హరీశ్ రావు డిమాండ్ చేశారు.