హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు మరోసారి ద్వజమెత్తారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. పేదల ఇండ్లు ఎందుకు కూలగొట్టారని ప్రశ్నించినందుకు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం హేయమైన చర్య అన్నారు. ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా ప్రజా పాలన అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసులు కొత్త కాదు.. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల తరుపున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం, ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.