calender_icon.png 5 April, 2025 | 1:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె పల్లెలో గులాబీ జెండా పండుగ

05-04-2025 01:51:46 AM

గులాబీ కంచు కోటలో 25 ఏళ్ల వైభవం వెల్లి విరియాలి 

వెయ్యి మందితో విద్యార్థి, యువత పాదయాత్ర,

100 ట్రాక్టర్స్‌తో ర్యాలీతో వరంగల్ సభకు

పార్టీ ఆవిర్భావ నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్న హరీశ్‌రావు

సిద్దిపేట, ఏప్రిల్ 4 (విజయక్రాంతి):సిద్దిపేటకు 25 ఏళ్ల కీర్తి ఉందని  గులాబీ జెండా పుట్టిన గడ్డ సిద్దిపేట నియోజకవర్గంలోని పల్లెలో గులాబీ జెండా ఎగరాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సూ చించారు. ఈ నెల 27 న వరంగల్ లో జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ సందర్బంగా నియోజకవర్గ ముఖ్య నాయకులతో సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ బిఆర్‌ఎస్ 2001లో సిద్దిపేట కొనాయ్ పల్లి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం, సిద్దిపేట ప్రజల ఆశీస్సులు తీసుకోని కెసిఆర్ గులాబీ జెండా ఎగరవేశారని చెప్పారు. సిద్దిపేట వాళ్ళు లేని బహిరంగ సభ లేదని, ఎక్కడ సభ అయినా.. ఎక్కడ ఎన్నికలు అయిన ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు సిద్దిపేట నాయకులు పని చేసినారని గుర్తు చేశారు.

 ప్రజల ఉసురు.. మూగ జీవాల అర్థనాదాలు ఊరికే పోదు.. 

రేవంత్ రెడ్డి పాలన పెయిల్ అయిందని హరీష్ రావు విమర్శించారు. హైడ్రా పేరుతొ పేద ప్రజల జీవితాలు నాశనం చేసిండని, భూముల అమ్మకాల పేరుతొ మూగ జీవా ల గోస పోసుకున్నాడని మూగ జీవాలు రేవంత్ రెడ్డిని క్షమించవని మండిపడ్డారు. సగం రుణ మాఫీ చేసి చేతులు ఎత్తే సిండన్నాడని, వాన కాలం రైతు బందు ఎగొట్టిన డబ్బులు రూ.13 వేల కోట్లు.. రుణ మాఫీ చేసింది రూ.14 వేల కోట్లు అంటే రైతు బందు ఎగొట్టి రుణ మాఫీ సగం మాత్రమే చేశారని చెప్పారు. సిఎం రేవంత్ రెడ్డిని తిట్టని ఊరు లేదని, పంటల బోనస్ బోగస్, రుణ మాఫీ బోగస్, ఇన్ పుట్ సబ్సిడీ బోగస్ అని ఏద్దేవా చేశారు. ప్రభుత్వం వైఫల్యం వలన చేర్యాల, మద్దూరు, బచ్చన్న పేట జనగాంలో 50వేల ఎకరాలు ఎండి పోయిందని,  ప్రభుత్వం ఫై ఒత్తిడి తెచ్చి రంగనాయక సాగర్ లో 1టి ఎం సి నీళ్లు నింపడంతో మన సిద్దిపేట నియోజకవర్గంలో ఒక్క ఎకరం ఎండి పోలేదన్నారు.  ప్రభుత్వం వైఫల్యాలు ప్రజా వ్యతిరేకత వరంగల్ సభలో ఏండగట్టాలన్నారు.

వెయ్యి మందితో వరంగల్ సభకు పాదయాత్ర

సిద్దిపేట నియోజకవర్గం నుండి 20వేలకు పైన జన సమీకరణ ఉండాలని పెద్ద ఎత్తున తరలిగా రావాలని హరీష్ రావు నాయకులకు దిశా నిర్దేశం చేశారు. సిద్దిపేట కీర్తిని మరో సారి చాటలని చెప్పారు. విద్యా ర్థి, యువత కలిసి వెయ్యి మందితో పాదయాత్రగా, 100 ట్రాక్టర్ లతో ర్యాలీ నిర్వహి స్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు.