calender_icon.png 26 November, 2024 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంకెందరు దవాఖాన పాలు కావాలి.. ప్రాణాలు కోల్పోవాలి?

26-11-2024 05:36:14 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): మాగనూర్ జడ్పీ పాఠశాలలో మధ్యాహ్నా భోజనం చేసిన 40 మంది విద్యార్థులకు అస్వస్థత గురయ్యారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఇదే పాఠశాలలో వంద మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి 10 రోజులు కూడా గడవలేదు. మళ్ళీ మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి 40 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో మహబూబ్ నగర్ జిల్లా దవాఖానలో చేరిన దుస్థితి ఏర్పాడిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు మండిపడ్డారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కనీస చర్యలకు ఉపక్రమించడం లేదని, విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయని ఆరోపించారు. మాటలే తప్ప చేతలు లేని తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలు కావాలి, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి? హరీశ్ రావు ప్రశ్నించారు.