calender_icon.png 13 November, 2024 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన విద్యార్థుల ప్రాణాలంటే ఇంత చిన్న చూపా..?

10-11-2024 11:52:49 AM

హైదరాబాద్:  వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ లో కాలం చెల్లిన మందులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకంటే నిర్లక్ష్యం మరొకటి ఉంటుందా..?, గిరిజన గురుకుల విద్యార్థుల ప్రాణాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత చిన్న చూపా..?, ఈ మందుల వల్ల ప్రాణాల మీదకు వస్తే ఎవరు బాధ్యులు..?, కాలం చెల్లిన మందులు మెడికల్ క్యాంపులోకి ఎలా వచ్చాయి.?అదిలాబాద్ జిల్లాలో ఇంత జరుగుతుంటే జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ఏం చేస్తున్నట్లు?, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు పట్టించుకునే తీరిక లేదా?, కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర ఇంకెప్పుడు వీడుతుంది? అని హరీశ్ రావు ప్రశ్నించారు.