22-03-2025 01:20:06 PM
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు(Telangana Legislative Assembly Sessions) శనివారం రసవత్తరంగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) మాట్లాడుతూ.. రోడ్ల నిర్మాణంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం లేదన్నారు. బడ్జెట్ లో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం ఉండదన్నారని తేల్చిచెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం లేదని చెప్పడం బాధ్యతారాహిత్యమని హరీశ్ రావు మండిపడ్డారు. బడ్జెట్ లో ఉపముఖ్యమంత్రి 60 శాతం ప్రభుత్వ నిధులు ఉన్నాయని చెబుతున్నారు.
రుణాలు ఎఫ్ఆర్ బీఎం పరిధిలోకి వస్తాయా?, ప్రభుత్వం ఎన్నేళ్లు చెల్లిస్తుంది? హ్యామ్ రోడ్ల ఎంపిక ప్రాతిపదిక ఏమిటి?అని హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంత్రి కోమటి రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) సమాధాన్ని నిరసిస్తూ సభ నుంచి బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. ఇతర విషయాలు ప్రస్తావించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన రోడ్ల గణాంకాలు స్పీకర్ సమక్షంలో పెట్టాలని వారు డిమాండ్ చేశారు. స్పీకర్ సమక్షంలో పెట్టాలని డిమాండ్ చేసినా స్పందించలేదని బీఆర్ఎస్ వాకౌట్ చేసింది.