calender_icon.png 26 December, 2024 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన హరీష్ రావు

04-12-2024 06:34:51 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు క్వాష్ పిటిషన్ దాఖాలు చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొటివేయాలని క్వాస్ పిటిషన్ పేర్కొన్నారు. రాజకీయదురుద్దేశంతోనే తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే తప్పుడు కేసు నమోదు చేశారని హరీశ్ రావు ఆరోపించారు. ఎఫ్ఐఆర్ పై తదుపరి దర్యాప్తు చేయకుండా స్టే ఇవ్వాలని  ఆయన న్యాయస్థానాన్ని కోరారు.

సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా హరీశ్ రావుపై మంగళవారం పంజాగుట్ట పీఎస్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం తెలిసిందే.  ఛక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేయడంతో హరీశ్ రావుతో పాటు అప్పటి టాస్క్  ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావుపై పోలీసులు 120(బీ), 386, 409, 506, రెడ్ విత్ 34, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో తన ఫోన్ తోపాటు తన కుటుంబ సభ్యులకు చెందిన 20 మంది ఫోన్లను ప్రణీత్ రావు సాయంతో ట్యాప్ చేశారని హరీశ్ రావుపై ఆరోపణలు చేశారు.