హైదరాబాద్ : రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీకి లింకు పెట్టవద్దన్న ఆదేశాలను స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతు రుణమాఫీకి సైతం రేషన్ కార్డు నిబంధన ఎత్తివేయాలని, రేషన్ కార్డులు ఉన్నవారికే రుణమాఫీ చేయడం సరికాదని, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడం మీ తప్పు కాదా? అని ప్రశ్నించారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, పాస్ బుక్ నే రుణమాఫీకి ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. గతంలో ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేశామని హరీశ్ రావ్ పేర్కొన్నారు.