calender_icon.png 21 September, 2024 | 8:05 AM

సురేందర్ ది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య

08-09-2024 12:49:36 PM

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియాతో సమావేశం అన్నారు. ఫేజ్-3 రుణమాఫీ జాబితా మాత్రమే బ్యాంకులకు ఇచ్చారని ఆరోపించారు. అందరికీ రుణమాఫీ అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పారని విమర్శించారు. రుణమాఫీ కాలేదని రైతు ఆత్మహత్య చేసుకున్నాడని హరీశ్ రావు మండిపడ్డారు. మేడ్చల్ వ్యవసాయ అధికారి కార్యాలయం వద్దే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.

రుణమాఫీ అయితే రైతు సురేందర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నట్లు? అని ప్రశ్నించారు. సురేందర్ ది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య అన్నారు. రుణమాఫీ కాలేదని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు. 9 నెలల కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 9 నెలల పాలనలో 400 మందికి పైగా 75 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. బీఆర్ఎస్ పాలనలో పోలీసులకు దేశవ్యాప్తం గుర్తింపు ఉండేది, పోలీసు స్టేషన్  నిర్వహణ కోసం కేసీఆర్ ప్రభుత్వం నెలకు రూ. 75 వేలు ఇచ్చేవారని చెప్పారు. రేవంత్ వచ్చిన వెంటనే రూ. 75 వేలు బంద్ చేశారు.