calender_icon.png 10 March, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ ప్రతిచుక్క ఒడిసిపడితే.. రేవంత్ రెడ్డి విడిచిపెట్టారు

10-03-2025 04:31:53 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతిచుక్క ఒడిసిపడితే.. రేవంత్ రెడ్డి ప్రతి చుక్క విడిచిపెడుతున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. జనగామలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ... సీఎంకు పరిపాలన దక్షత లేదని, రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి గ్రహణంలా పట్టారని 33రోజులుగా మోటార్లు నడపనందున పంటలకు నీళ్లు లేవని, ఇప్పుడు మోటార్లు నడిపితే పంటలకు నీళ్లు అందట్లేదని హరీశ్ రావు ఆరోపించారు. వరంగల్ జల్లాలోనే లక్ష ఎకరాల్లో పంట ఎండిపోతోందని, కాంగ్రెస్ వైఫల్యంతోనే పంటలు ఎండుతున్నాయి కానీ, ప్రకృతి వైపరిత్యం కాదన్నారు.

అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్సేలు తామ చేతకానితనానికి ప్రకృతి పేరు చెప్పి తప్పించుకోవాలని యత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి గురువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జాలాలను ఆంధ్రకు కేటాయించిన వాటా కంటే ఎక్కువ నీటిని పట్టుకుపోతున్నారని హరీశ్ రావు చెప్పారు. నీళ్లు కచ్చితంగా తీసుకుపోతామని చంద్రబాబు చెప్పారని, రేవంత్ రెడ్డి పాలన అంతా 20 శాతం కమీషన్ లాగా ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు. మొన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ది 20-20 మ్యాచ్ అన్నారు. అవును నిజమే ప్రభుత్వంలో ఏ పని చేయాలన్నా 20 శాతం కమీషన్ ఇవ్వాల్సిందే అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి 20 శాతం కమీషన్ మీద ఉన్న ప్రేమ రైతులకు నీళ్ళు ఇవ్వడంలో లేదని హరీశ్ రావు పేర్కొన్నారు.