calender_icon.png 4 October, 2024 | 4:58 PM

రేవంత్ రెడ్డిది రాతి గుండె.. కేసీఆర్‌ది రైతు గుండె

04-10-2024 01:39:35 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది రాతి గుండె.. కేసీఆర్ ది రైతు గుండె అని మాజీ మంత్రి, బీఎర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. మహబూబాబాద్  జిల్లా తొర్రూరులో రైతుల ధర్నాకు దిగారు. ధర్నాలో హరీశ్ రావు, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం ఏమైందని హరీశ్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ లో ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం అమలవుతోందన్నారు. హైదరాబాద్ లో హైడ్రా పేరుతో ఇళ్లు కూలుస్తున్నారని ధ్వజమెత్తారు. పేదల ఇళ్లు కూల్చితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు.

ఉపాధి కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు హామీ ఏమైంది..?, మూతపడ్డ చెక్కెర కర్మాగారాం, పసుపుబోర్డు హామీ ఏమైంది..? భూమి లేదని రైతులకు రూ. 5 లక్షల రైతుబీమా ఏమైంది..? అని హరీశ్ రావు ప్రశ్నించారు. దసరాలోపు రైతుబంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎకరానికి రైతుల ఖాతాల్లో రూ.. 7500 జమ చయాలన్నారు. కుంటి సాకులు లేకుండా అందికీ రూ. 2 లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హరీశ్ రావు తెలిపారు. రైతులు చనిపోతున్నా సీఎం రేవంత్ రెడ్డికి కనికరం లేదని హరీశ్ రావు మండిపడ్డారు.