12-04-2025 07:01:33 PM
సిద్దిపేట,(విజయక్రాంతి): హనుమాన్ విజయోత్సవం సందర్బంగా సిద్దిపేటలోని రామ రాజు రావి చెట్టు హనుమాన్ దేవాలయంలో జరిగిన హనుమాన్ మాలధారణ స్వాముల బిక్షా కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయంలో ఏర్పాటు చేసిన పల్లకి సేవలో హనుమాన్ స్వాములతో కలసి స్వామివారి పల్లకి మోశారు. అనంతరం ఆలయంలో ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... ఆంజనేయ స్వామి సీతా దేవిని శ్రీరామచంద్ర స్వామికి అప్పిగించిన సందర్బంగా హనుమాన్ సేవలు అమోఘమని శ్రీ రాముడు ఆంజనేయున్ని మేచ్చుకొని సన్మానం చేసిన రోజు హనుమాన్ విజయోత్సవం అని అన్నారు. హనుమాన్ సర్వ జగత్ రక్షకుడన్నారని పేర్కొన్నారు. హనుమాన్ స్వామి అనుగ్రహంతో అన్నింటా శుభం కలగాలని కోరుకున్నారు. హనుమాన్ విజయోత్సవ వేడుకల్లో భాగంగా బిక్షా కార్యక్రమంలో హనుమాన్ మాలధారణ స్వాములతో కలసి పాల్గొన్నారు.