calender_icon.png 22 February, 2025 | 4:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుమ్మడిదలను మరో లగచర్ల చేయకండి: హరీశ్ రావు

14-02-2025 04:20:18 PM

గుమ్మడిదల,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు(GHMC Dump Yard) ఏర్పాటును ప్రజలు గత కొన్ని రోజులుగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు.  గుమ్మడిదల స్థానికులు చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Siddipet MLA Harish Rao) మద్దుతు తెలుపుతూ.. సంఘీభావంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... గుమ్మడిదలను మరో లగచర్ల చేయకండి అని అన్నారు. తక్షణమే అక్కడ ఏర్పాటు చేస్తున్న డంపు యార్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇందిరమ్మ రాజ్యమంటూ నాటి ఎమర్జెన్సీని తలపిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రుణమాఫీ, రైతుబంధు, మహాలక్ష్మీ పథకం అన్నీ మోసమే అన్నారు. గుమ్మడిదల సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తుతామని, డంపింగ్ యార్డు రద్దు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీ తరపున అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. ఎయిర్ఫోర్స్ అకాడమీ కూడా డంపింగ్ యార్డును వ్యతిరేకించిందని, డంపింగ్ యార్డు ఏర్పాటు చేయొద్దని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు హరీశ్ రావు చెప్పారు.