calender_icon.png 17 October, 2024 | 1:59 PM

వన్ నేషన్- వన్ ఎంఎస్‌పీ ఎందుకు ఇవ్వట్లేదు..?

17-10-2024 11:58:04 AM

రాష్ట్ర రైతు పట్ల ఎందుకీ వివక్ష..?: హరీశ్ రావు

గుజరాత్ కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా..?

హైదరాబాద్: పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ నీతి అనుసరిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. పత్తికి కేంద్రం చెల్లించే మద్దతు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎందుకు ఉందన్నారు. కేంద్ర.. పత్తి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని హరీశ్ రావు విమర్శించారు. వన్ నేషన్- వన్ ఎంఎస్ పీ ఎందుకు ఇవ్వట్లేదు..?, నాణ్యమైన పత్తిని పండిస్తున్న రాష్ట్ర రైతు పట్ల ఎందుకీ వివక్ష..? అని హరీశ్ రావు ప్రశ్నించారు. గుజరాత్ పత్తికి మద్దతుగా ధరగా క్వింటాకు రూ. 8,257.. తెలంగాణ పత్తికి రూ. 7,521 మాత్రమే చెల్లించడం దుర్మార్గం అన్నారు. గుజరాత్ కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా...? అని ప్రశ్నించారు.