calender_icon.png 15 November, 2024 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాపై కేసులు పెట్టుకోండి.. రైతుల జోలికి వెళ్లొద్దు: హరీశ్ రావు

14-11-2024 02:52:44 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట్ ఎమ్మెల్యే హరీశ్ రావు ములాఖాత్ అయ్యారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్షంగా ప్రజల తరుపున పోరాడటం తమ బాధ్యత అని, రాష్ట్రంలో ఏం జరిగిన బీఆర్ఎస్ పైనే కాంగ్రెస్ ప్రభుత్వం నిందలు వేస్తుందని హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రజా తిరుగుబాటు నుంచి కాంగ్రెస్ తప్పించుకోలేదని, వాళ్లు ఓట్లేసి గెలుపించిన పాపానికి వారి భూములను గుంజుకుంటున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ చేసే అక్రమాలను ఎదిరించడమే తమ బాధ్యత అని, లేకపోతే ప్రభుత్వ చేసే అక్రమాలకు తము కూడా భజన చేయాలా..? అని ప్రశ్నించారు.  తమపై కక్ష ఉంటే ఎన్ని అక్రమ కేసులు పెడతారో పెట్టుకోండి, కానీ రైతుల జోలికి వెళ్లొద్దని డిమాండ్ చేశారు. తామకేం పోరాటాలు కొత్త కాదు అని, ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని హరీశ్ రావు స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లాలోని లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై జరిగిన దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి ఆరోపణలు ఎందుర్కొంటున్నారు. బుధవారం కొడంగల్ కోర్టు ఆయన 14 రోజుల రిమాండ్ విధించడంతో నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైల్ కు తరలించారు.