calender_icon.png 3 October, 2024 | 4:35 PM

ప్రాణాలైనా ఇస్తాం.. బంగారు పంటలు పండే భూములు ఇవ్వం

03-10-2024 12:17:32 PM

ఫార్మాసిటీకి భూములు ఇచ్చే ప్రసక్తే లేదు..

రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముందు రైతుల ఆవేదన 

సంగారెడ్డి, (విజయ క్రాంతి): ప్రాణాలైనా ఇస్తాం... మా భూములు ఇవ్వమని డప్పు రైతులు రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముందు తమ ఆవేదన తెలిపారు. గురువారం న్యాల్కల్ మండలంలోని డప్పురు గ్రామంలో ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భూ బాధితులతో హరీష్ రావు ముఖాముఖి నిర్వహించారు. డప్పురు గ్రామానికి చెందిన పలువురు రైతులు తమ పంట పొలాలను చూపించి ఇలాంటి బంగారు పంటలు పండి భూములు మాత్రమే ఇవ్వమని అవసరమైతే ప్రాణాలు ఇస్తామని తేల్చి చెప్పారు. ఎకరాకు 15 లక్షలు ఇస్తారంట అవి ఎక్కడ కూడా సరిపోవని మా గ్రామంలో ఇల్లు కట్టుకునేందుకు ప్లాటు జాగ్రత్తగా రాదన్నారు.

ఈ ప్రభుత్వం పాపం తగిలి పడిపోతుందని శాపానార్థులు పెట్టారు. ఎలక్షన్ల ముందు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆమె కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. కెసిఆర్ ప్రభుత్వ హాయంలో రైతుబంధు పింఛన్లు తప్పకుండా వచ్చామన్నారు. రుణమాఫీ చేస్తామని మోసం చేశారని రైతుబంధు ఇప్పటివరకు ఇవ్వలేదు అన్నారు. ఫార్మాసిటీ కోసం భూములు ఇవ్వబోమని ప్రభుత్వం దౌర్జన్యం చేస్తే ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వమన్నారు. రైతులకు మద్దతుగా మేముంటామని హరీష్ రావు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, టిఆర్ఎస్  మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ తో పాటు నాయకులు రైతులు పాల్గొన్నారు.