calender_icon.png 30 September, 2024 | 3:21 PM

మంత్రిని విమర్శిస్తే నాలుక చీరేస్తాం

30-09-2024 02:03:58 PM

మా ఆడపడుచు జోలికొస్తే ఉరికించి ఉరికించి కొడతాం

దుబ్బాక, (విజయక్రాంతి): జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుకలు చీరేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ అన్నారు. సోమవారం నాడు పద్మశాలి చేనేత కార్మికుల ఆధ్వర్యంలో మంత్రి  పై అనుచిత వ్యాఖ్యలు చేయించిన హరీష్ రావు కేటీఆర్ సోషల్ మీడియా పోస్టర్ ను దగ్ధం చేశారు.  కొండా సురేఖ  తాను ఇన్చార్జి మంత్రిగా  దుబ్బాక పట్టణంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సందర్భంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు రఘునందన్  సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాలలో చేనేత సమస్యలు అనేకం ఉన్నాయి.

అక్కా అందుకే నూలు దండతో మీకు సమస్యల మాల వేస్తున్నాను. ఒక తమ్ముడు అక్కకు రాఖీ కట్టి నట్టుగానే రఘునందన్ రావు చేనేత సమస్యలు తీర్చండి అని నూలు దండ వేస్తే హరీష్ రావు కేటీఆర్ లు వీరి పెళ్లికి కూడా కళ్యాణ లక్ష్మి, చెక్కు వచ్చిందా అనీ అక్కా చెల్లెళ్ళ బంధాన్ని రాఖీ సంభందాన్ని వారి పెంపుడు కుక్కల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ నూలుదండను, పద్మశాలి ఆడబిడ్డను అగౌరవపరుస్తూ విష ప్రచారం చేస్తున్నారని పద్మశాలి ఆడబిడ్డను అవమానించిన కుక్కలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేద్దామని, మొట్టమొదటిసారి దుబ్బాక నియోజకవర్గంకి వచ్చినటువంటి మంత్రిని ఇలా అవమానపరచడం దుబ్బాక నియోజకవర్గం ప్రజలువ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. మంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మా ఆడపడుచు జోలికి వస్తే బట్టలు ఊడదీసి ఉరికిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు.పద్మశాలి సమాజం అధ్యక్షులు,జిందం గాలయ,నాయకులు కడవెరు గోపి.. ఆలేటి సరోజన, దాసరపు లక్ష్మి,మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు.