calender_icon.png 20 January, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగనాయక సాగర్ పై హరీశ్ రావు హర్షం

20-01-2025 03:11:25 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రంగనాయక సాగర్ నీటిలో నిండటంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. గోదావరి గంగ నీళ్లు వందల కిలోమీటర్లు ప్రయాణించి రంగనాయక సాగర్ కు చేరిందన్నారు. కూలిపోయిందని నిందలు వేసి కాళేశ్వరాన్ని బదనాం చేస్తున్నవారు కన్నులు తెరచి ఈ సుందర దృశ్యం చూడండి అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణాధారం.. దాన్ని చెరపేయలేమన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ ఇప్పుడు నిండు కుండలా మారిందని హరీశ్ రావు హర్షం వ్యకం చేశారు. ప్రతీ నీటి చుక్కలో ఉన్న కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం సీఎం రేవంత్ రెడ్డి నీ తరం కాదని హరీశ్ రావు పేర్కొన్నారు.