calender_icon.png 28 October, 2024 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ ఇచ్చారు.. అదేమైనా తప్పా.. సీఎంపై హరీశ్ సంచలన వ్యాఖ్యలు

28-10-2024 02:43:02 PM

సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో ఎక్కడా చూసిన ధర్నాలే కనిపిస్తున్నాయి

హైదరాబాద్: ఇల్లు కట్టుకుని కుటంబం తరుపున పార్టీ ఇచ్చారు.. అదేమైన తప్పా.. ఫామ్ హౌస్, డ్రగ్స్, రేవ్ పార్టీ అని దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి.. డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయా వర్గాలు ఎందుకు తిరగబడుతున్నాయి? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ప్రశ్నించారు. బతుకమ్మ చీరలు రెండు ఇస్తామన్నారు.. ఒక్కటీ ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధర్నాలే కనిపిస్తున్నాయని చెప్పారు. ఎన్నికల్లో నోటికి వచ్చినట్లు హామీలు ఇచ్చారు.. హామీలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

రైతుబంధు 3 పంటలకు ఇస్తామన్నారు.. రూ. 15 వేలు ఇస్తామన్నారు.. ఎక్కడ చూసినా పంటలకు మద్దతుధర లేదని ఆరోపించారు. పత్తికి మద్దతుధర ఇవ్వకుండా రైతులను అనేక కష్టాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పత్తి రైతులు అసంతృప్తిగా ఉన్నారని విమర్శించారు. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంలో పత్తి రైతులు రోడ్డెక్కారు. వరికి బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. మొక్కజోన్న, సోయాబీన్ రైతులు కూడా మోసపోతున్నారన్నారు. ఇప్పటివరకు ఎక్కడా మొక్క జోన్న కొనుగోలు కేంద్రాలే పెట్టలేదని ద్వజమెత్తారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం 20 వేల ఉద్యోగాలైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. రుణమాఫీ గురించి అడిగానని తనపైనే దాడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మూసీ పేరుతో  జరుగుతున్న అవినీతిపై తాము పోరాడుతున్నామన్నారు. మీ ప్రభుత్వాన్ని పోలీసులు కూడా విమర్శిస్తున్నారని హరీశ్ రావు తెలిపారు.