హైదరాబాద్,(విజయక్రాంతి): శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మాజీ సర్పంచుల అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోలన చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మాజీ సర్పంచులతో మాట్లాడేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమయం లేదా..? అని ప్రశ్నించారు. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఆరోపించారు. ఢిల్లీ నుంచి వచ్చిన నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. తెలంగాణలో ఆర్ గ్యారంటీలు అమలయ్యాయని ప్రచారం చేస్తున్నారు కానీ, 300 రోజులైనా కూడా ఆరు గ్యారంటీలు అమలు చేయలేదన్నారు. మహారాలష్ట్రలో పెద్దపెద్ద పోస్టర్లు వేసి ప్రచారం చేస్తున్నారని వివర్శించారు.
రాహుల్ గాంధీ అశోక్ నగర్ వెళ్లి నిరుద్యోగ యువతతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచులకు బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం వారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రాజీవ్ గాంధీపై ప్రేమ ఉంటే స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని సవాల్ చేశారు. ఆ స్థానిక సంస్థలకు చెందిన సర్పంచులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులన్నీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీ రేపు సమీక్ష నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనకపోవడంతో రైతులు రోడ్డపైకి వచ్చి ధర్నాలు, బోధనా ఫీజులు చెల్లించలేదని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో హరీశ్ రావుతో పాటు మాజీ మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, డా.సంజయ్ కల్వకుంట్ల, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.