హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో కౌలు రైతులు తాము పండించిన పత్తిని మద్దతు ధరకు అమ్ముకోలేని దుస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కౌలు రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన తీవ్ర విమర్శలు గుప్పించారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన పత్తి రైతులకు, కొనుగోలు విషయంలో సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి పండించిన కౌలు రైతుల సమస్యలకు తక్షణం పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు.