calender_icon.png 12 December, 2024 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంత కంటే దారుణం ఏముంటుంది: హరీశ్ రావు

12-12-2024 02:30:21 PM

హైదరాబాద్: దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడం హేయమైన చర్య అన్నారు. ఇంత కంటే దారుణం ఏముంటుంది. రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా..? లేక దోపిడీ దొంగనా..? అని ప్రశ్నించారు. రైతుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల భూములు గుంజుకుంటారు. తిరగబడితే అరెస్టులు చేస్తారు. రైతులను ఉగ్రవాదులుగా భావిస్తూ అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి.. ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం. ఇదేనా మీ ప్రజాపాలన? అని ప్రశ్నించారు.