హైదరాబాద్,(విజయక్రాంతి): నాడు ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డెక్కితే నేడు ఇంటింటి సర్వే పత్రాలు రోడ్డెక్కాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వేలో వివరాలన్ని డొల్ల అని హరీశ్ రావ్ ఎద్దేవా చేశారు. సైబర్ మోసగాళ్ల చేతికి ఈ వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏమిటి..? అని ప్రశ్నించారు. ప్రజల గోప్యతకు భంగం కలిగించేలా ఉన్న ప్రభుత్వ సర్వేను ఖండిస్తున్నామన్నారు. ప్రజల వివరాలకు భద్రత కల్పించాలని హరీశ్ రావు హెచ్చరించారు.