calender_icon.png 2 October, 2024 | 1:44 PM

పూలను పూజిస్తూ.. ప్రకృతిని ఆరాధించే పండగ బతుకమ్మ: హరీశ్ రావు

02-10-2024 10:48:22 AM

హైదరాబాద్: పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రజల పండుగ బతుకమ్మ పండుగను అందరూ సంబురంగా జరుపుకోవాలని, మన సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు భద్రంగా అందించాలని హరీశ్ రావు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆడపడుచులందరికీ ఆయన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.