calender_icon.png 31 October, 2024 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలువల ద్వారా నీటి విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేయాలి

11-08-2024 01:18:40 PM

రంగనాయక సాగర్ రిజర్వాయర్ లో  3 టిఎంసీల నీటిని నింపాలి...

సిద్దిపేట, (విజయక్రాంతి): సిద్దిపేట నియోజకవర్గంలోని రంగనాయక సాగర్ లో ఇటీవల నెమిడ్ మానేరు ద్వారా నీటి పంపింగ్ జరిగింది. రిజర్వాయర్ లోని నీటిని కాలువలకు వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలనీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఇరిగేషన్ అధికారులను కోరారు. హరీష్ రావు పార్టీ కార్యకర్తలతో కలిసి ఆదివారం రంగనాయక సాగర్ ని సందర్శించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఇరిగేషన్ ఎస్ ఈ బస్వరాజ్, ఈఈ గోపాల కృష్ణ తో హరీష్ రావు ఫోన్ లో మాట్లాడారు. ప్రస్తుతం రంగనాయక సాగర్ లో 2.3 నీరు ఉందని,  3టి ఎంసిల పూర్తి సామర్థ్యం నీటిని నింపాలన్నారు. రిజర్వాయర్ ల నుండి కాలువలకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. కెనాల్స్ లలో మట్టి, పిచ్చి గడ్డి తుంగ పెరుక పోయిందని వెంటనే తొలగించాలని చెప్పారు. త్వరితగతిన కాలువల్లోకి నీటిని విడుదల చేసి రైతుంగానికి పంటల సాగుకు నీరందించాలని అధికారులను కోరారు.