calender_icon.png 14 November, 2024 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్నం నరేందర్ రెడ్డి అక్రమ అరెస్టు.. దుర్మార్గం

13-11-2024 11:20:47 AM

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటన్నారు. పచ్చని పొలాల్లో ఫార్మసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా..?, నడి రాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా..?  అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరని హరీశ్ రావు హెచ్చరించారు.  మీ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు.. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతమన్న హరీశ్ ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటామని తెలిపారు. అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.