calender_icon.png 15 March, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ వచ్చింది.. నాటి దుర్భర పరిస్థితులను తెచ్చింది

15-03-2025 10:48:31 AM

హైదరాబాద్: కాంగ్రెస్ వచ్చింది..మళ్ళీ ఉమ్మడి పాలన నాటి దుర్భర పరిస్థితులను తెచ్చిందని హరీశ్ రావు(Thanneeru Harish Rao ) ఆరోపించారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే దుస్థితి మళ్ళీ దాపురించిందన్నారు. కాంగ్రెస్(Congress) ఏడాదిన్నర పాలనా వైఫల్యానికి దీన స్థితికి చేరుకున్న ప్రభుత్వ ఆసుపత్రులు (Government hospitals) మరో నిదర్శనమని చురకలంటించారు. జ్వరం గోళీలు కూడా ఇవ్వలేని దుస్థితికి వైద్య రంగం దిగజారడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధతకు అద్దం పడుతున్నదని ద్వజమెత్తారు. జలుబు, ఒంటినొప్పులకు ఇచ్చే సాధారణ మందులు కూడా బయట కొనుగోలు చేయాల్సి రావడం సిగ్గుచేటు అన్నారు. 

చిన్నపిల్లలకు ఇచ్చే విటమిన్ - ఏ సిరప్ కూడా లేకపోవడాన్ని బట్టే నిరుపేదల వైద్యంపై ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థం అవుతోందన్నారు. లక్షల మంది నిరుపేదలు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటారు. ఈ ప్రభుత్వ చేతగాని తనం కారణంగా వారికి సర్కారు దవాఖనలపై నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నిర్లక్ష్య పాలన(Congress negligence rule) నిరుపేదలకు శాపంగా మారిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన నినాదం 'మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి', అది మార్పు కాదు, వట్టి ఏమార్పు అని ప్రజలకు ఇప్పటికే అర్థమయిపోయిందని హరీశ్ రావు పేర్కొన్నారు.