calender_icon.png 27 December, 2024 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీతేజ్‌ను పరామర్శించిన హరీష్‌రావు

26-12-2024 05:50:10 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): డిసెంబర్ 4వ తేదీన సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తొమ్మిదేళ్ల శ్రీతేజ్‌ను బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గురువారం పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కిమ్స్ కు వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన  మొదటి బీఆర్‌ఎస్ నాయకుడు హరీశ్ రావు. పుష్ప-2 సినిమా ప్రీమియర్ స్క్రీనింగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో బాలుడు గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

ఈ ఘటనలో బాలుడి తల్లి రేవతి అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీతేజ్ గాయాలతో బయటపడ్డిన విషయం తెలిసిందే. నిన్న సినీ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, అల్లు అరవింద్, పుష్ప-2 చిత్ర నిర్మాత రవిశంకర్ బుధవారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీ తేజ్ ను పరామర్శించారు. పుష్ప-2 చిత్ర యూనిట్ తరుఫున శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం ప్రకటించారు. నటుడు అల్లు అర్జున్ తరుఫున రూ. కోటి, పుష్ప2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ. 50 లక్షల పరిహారం ప్రకటించారు. పరిహారం చెక్కులను ఎఫ్ డీసీ ఛైర్మన్ కు అల్లు అరవింద్ అందించారు.