calender_icon.png 27 November, 2024 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవస్థలను హరీశ్ భ్రష్టు పట్టించారు

13-08-2024 01:08:45 AM

మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): రాష్ట్ర ఆర్థిక మంత్రిగా హరీశ్ రావు ఉన్నప్పుడు అన్నీ వ్యవస్థలను భ్రష్టు పట్టించి, తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సోమవారం మాట్లాడుతూ.. అరకొరగా చేసిన పంట రుణమాఫీ కూడా 3 లక్షల మంది అర్హులైన రైతులకు అమలు కాలేదని, సాంకేతిక కారణాలు చూపి ఆ రైతులకు రుణాలు మాఫీ చేయలేదన్నారు. రుణమాఫీ కాక, బ్యాంకులు వేలమంది రైతులను బ్లాక్ లిస్టులో పెట్టి కొత్త రుణాలు పుట్టకుండా చేశాయని, అప్పుడు హరీశ్‌రావు ఏ కలుగులో దాక్కున్నారో చెప్పాలని ఎద్దేవా చేశారు.

అవమానాలు భరించలేక మహబూబాబాద్‌లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పడే హరీశ్‌రావు కాల్ సెంటర్ పెట్టుకొని ఈ పనిచేసి ఉంటే బాగుండేదని, ఇప్పడు మా ప్రభుత్వం అర్హులైన వారికి రెండు విడుతల్లో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిందన్నారు. సాంకేతిక, ఇతర సమస్యలతో రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. ఒక నెలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రేషన్‌కార్డు లేని వారికి, సాంకేతిక సమస్య ఉన్నవారికి అమలు చేస్తామన్నారు.