calender_icon.png 26 November, 2024 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్‌ది గురువింద నీతి

10-10-2024 01:28:31 AM

మీరు చేయలేని రుణమాఫీ మేం చేశాం

మాది నిజాయతీ ఉన్న ప్రభుత్వం

బీఆర్‌ఎస్ నేతపై మంత్రి సీతక్క ఆగ్రహం

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): రుణమాఫీపై మాజీ మంత్రి హరీశ్‌రావు గురువింద కథలు చెబుతున్నారని, వారి హయాంలో అర్హులైన రైతులందరికీ మాఫీ జరిగినట్లు, కాంగ్రెస్ పది నెలల కాలంలో రుణ మాఫీని పట్టించుకోనట్టు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు.

ఆయన వైఖరి చూస్తుంటే గురువింద గింజ తన నలుపెరగదు అన్న సామెత గుర్తుకొస్తుం దని ఎద్దేవా చేశారు. తొమ్మిదిన్నర ఏళ్లలో బీఆర్‌ఎస్ పార్టీ పంట రుణమాఫీని అబాసు పాలు చేసిందని మండిపడ్డారు. ఒకే పంట కాలంలో ఏకంగా రూ.18 వేల కోట్ల రుణాలను మాఫీ చేసి 23 లక్షల మంది రైతులను రుణ విముక్తుల్ని చేశామని స్పష్టం చేశారు.

మీరు ఐదేళ్లలో చేయలేని పని ని తాము కేవలం 27 రోజుల్లోనే చేసి చూపించామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో సన్న వడ్లకు బోనస్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి కూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కలిపి తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సగటున రోజుకు రూ.207 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందని, మీ పదేళ్ల పాపాన్ని కడిగి వ్యవస్థలను గాడి లో పెడుతున్నామని స్పష్టం చేశారు.

ప్రజల కోసం మీరు ఏం చేయకపోగా ప్రజా ప్రభుత్వంపై గుడ్డి విమర్శలు చే యడం ఇకనైనా మానుకోవాలని హి తవు పలికారు. హర్యానాలో బీజేపీ విజయంతో ఇక్కడ బీఆర్‌ఎస్ సంబురపడటం చూస్తే రెండు పార్టీలు ఒకటేనని మరోసారి రుజువైందని విమర్శించారు.